Wednesday, June 17, 2026
Homeతెలంగాణకరీంనగర్గంగాధరలో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు

గంగాధరలో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు

📰 Generate e-Paper Clip

గంగాధర, జూన్ 16 (చైతన్యగళం):
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ గ్రామంలో సోమవారం ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నుండి వచ్చిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందం పాల్గొంది.గ్రామంలోని పాన్ షాపులు, వైన్స్ పర్మిట్ రూములు, పాఠశాలలు, ఇతర అనుమానాస్పద ప్రదేశాల్లో మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి నిషేధిత పదార్థాలు నిల్వ ఉంచుతున్నారా లేదా విక్రయిస్తున్నారా అనే అంశాలపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో ప్రతి ప్రదేశాన్ని జాగ్రత్తగా పరిశీలించి అనుమానాస్పద వస్తువుల కోసం తనిఖీలు చేపట్టారు.ఎస్సై వంశీకృష్ణ మాట్లాడుతూ, “ప్రజల్లో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కల్పించడం, నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యం” అని తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో డాగ్ స్క్వాడ్ బృందం, క్లూస్ టీమ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!