ఎలిగేడు, జూలై 21 (చైతన్య గళం):
పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విప్‌గా సమర్థవంతంగా విధులు నిర్వహించిన ఆయనకు మంత్రి హోదా లభించడం పట్ల నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుతున్నారు.
ఈ సందర్భంగా ఎలిగేడు పిఎసిఎస్ చైర్మన్ సామ రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దుగ్యాల సంతోష్ రావు మాట్లాడుతూ, “ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి కోసం విజయ రమణారావు చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి మంత్రి హోదా ఇవ్వడం జరిగింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సవాలు జరుపుతూ, విజయ రమణారావు నాయకత్వంలో అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
