Friday, July 17, 2026
Homeఆంధ్రప్రదేశ్ఈ నెల 17న ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఈ నెల 17న ప్రజా సమస్యల పరిష్కార వేదిక

📰 Generate e-Paper Clip

నంద్యాల, జూలై 16 (చైతన్యగళం):
వన్ మంత్ – ఫోర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా వెలుగోడు మండలంలో జూలై 17న ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహణ జరగనుంది. వెలుగోడు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రజల వినతులు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. భూ సమస్యలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్జీలను సంబంధిత శాఖల ద్వారా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల సమస్యలను నేరుగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపడతారని పేర్కొన్నారు. వెలుగోడు మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!