ఎలిగేడు, జూలై 16 (చైతన్యగళం):
వర్షాలు లేక నారుమళ్లకు వరినాట్లు వేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, వ్యవసాయ బావుల ద్వారా నీరు పెట్టుకోవాలంటే కరెంట్ సరఫరా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని బీఆర్ఎస్ రైతు కమిటీ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన “త్రీఫేజ్ కరెంట్ తరచూ ట్రిప్ అవుతుండటంతో నారుమడిసైతం తడవడం లేదు. ఇచ్చిన టైంలో 10–20 సార్లు కరెంట్ పోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొద్దంతా త్రీఫేజ్ కరెంట్ ఇవ్వడంలేదు” అని అన్నారు.త్రీఫేజ్ సరఫరా సమయంలో ట్రిప్ కాకుండా చూడాలని, కరెంట్ ఇచ్చే సమయంపై రైతులకు గ్రూప్ మెసేజ్ ద్వారా సమాచారం ఇవ్వాలని విద్యుత్ అధికారులను ఆయన కోరారు.
