Monday, July 13, 2026
Homeతెలంగాణహుజురాబాద్‌లో జిల్లాస్థాయి కబడ్డీ టోర్నమెంట్

హుజురాబాద్‌లో జిల్లాస్థాయి కబడ్డీ టోర్నమెంట్

📰 Generate e-Paper Clip

కరీంనగర్ (చైతన్యగళం): ఉమ్మడి కరీంనగర్–వరంగల్ జిల్లాస్థాయి స్మారక కబడ్డీ టోర్నమెంట్ హుజురాబాద్‌లో ప్రారంభమైంది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు సొల్లు సారయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో 48 జట్లు పాల్గొన్నాయి.

ముఖ్య అతిథిగా హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు హాజరై, కబడ్డీ క్రీడ శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, క్రమశిక్షణను పెంపొందించే ఆట అని పేర్కొన్నారు. గెలుపు–ఓటములు సహజమని, ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, హెచ్‌ఎం శోభారాణి, వైస్ చైర్మన్ అంజలి, వార్డు కౌన్సిలర్లు, కబడ్డీ అసోసియేషన్ నాయకులు, పీడీ, పీఈటీలు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!