హుస్నాబాద్ , జూలై 5 (చైతన్య గళం):
చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ జేరిపోతుల శేఖర్ గుండె నొప్పితో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న హుస్నాబాద్ డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించారు.
అసోసియేషన్ సభ్యుల నుంచి సేకరించిన రూ.12,650 ఆర్థిక సహాయాన్ని కరీంనగర్ ఆసుపత్రికి వెళ్లి శేఖర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. శేఖర్ త్వరగా కోలుకుని తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు కొండి రవీందర్, ముక్కెర రమేష్, కోడె ముంజ రాజ్‌కుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
