Wednesday, July 1, 2026
Homeతెలంగాణసుల్తానాబాద్‌లో వినూత్న చర్య – 3D వాహనాల ఏర్పాటు

సుల్తానాబాద్‌లో వినూత్న చర్య – 3D వాహనాల ఏర్పాటు

📰 Generate e-Paper Clip

సుల్తానాబాద్ (చైతన్య గళం):
సుల్తానాబాద్ ప్రధాన రహదారిపై ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయత్నం ప్రశంసలు పొందుతోంది. సీఐ రంజిత్ రావు, ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో నారాయణపూర్ క్రాస్ రోడ్, ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్ సమీపంలో 3D రేడియం పోలీస్ ఇన్నోవా వాహన నమూనాలను ఏర్పాటు చేశారు.

ఈ వాహన నమూనాలను చూసి వాహనదారులు వేగాన్ని తగ్గిస్తూ అప్రమత్తంగా ప్రయాణిస్తున్నారని, రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపించే ఈ చర్యతో ప్రమాదాలు తగ్గుతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా పోలీసుల ఈ వినూత్న ఆలోచనకు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!