సుల్తానాబాద్ (చైతన్య గళం):
సుల్తానాబాద్ ప్రధాన రహదారిపై ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయత్నం ప్రశంసలు పొందుతోంది. సీఐ రంజిత్ రావు, ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో నారాయణపూర్ క్రాస్ రోడ్, ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్ సమీపంలో 3D రేడియం పోలీస్ ఇన్నోవా వాహన నమూనాలను ఏర్పాటు చేశారు.
ఈ వాహన నమూనాలను చూసి వాహనదారులు వేగాన్ని తగ్గిస్తూ అప్రమత్తంగా ప్రయాణిస్తున్నారని, రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపించే ఈ చర్యతో ప్రమాదాలు తగ్గుతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా పోలీసుల ఈ వినూత్న ఆలోచనకు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
