Wednesday, July 1, 2026
Homeతెలంగాణకరీంనగర్జిల్లా న్యాయస్థానం పర్యవేక్షకుడు వాసం శివ నారాయణ పదవీ విరమణ

జిల్లా న్యాయస్థానం పర్యవేక్షకుడు వాసం శివ నారాయణ పదవీ విరమణ

📰 Generate e-Paper Clip

కరీంనగర్ (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా న్యాయస్థానంలో సీనియర్ పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న వాసం శివ నారాయణ పదవి విరమణ ఉత్సవము మంగళవారం సాయంత్రం జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగింది. 28 ఏళ్ల సర్వీస్ ఉన్న శివ నారాయణ గారు తెలుగు సారస్వతములో దిట్ట. స్వయంగా పద్యకవి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాహితీవేత్తలు పలువురు పాల్గొని సాహితీవేత్త అయిన శివ నారాయణ గారిని ఘనంగా సన్మానించారు. కరీంనగర్ శరత్ సాహితీ కళా స్రవంతి అధ్యక్ష ,కార్యదర్శులు డాక్టర్ సబ్బరి లక్ష్మీనారాయణ, సంకేపల్లి నాగేంద్ర శర్మ, సాహితీవేత్తలు వెలమల జయపాల్ రెడ్డి, మర్రిపల్లి మహేందర్ తదితరులు హాజరై శివ నారాయణ గారిని ఘనంగా సన్మానించారు. డాక్టర్ సబ్బరి లక్ష్మీనారాయణ సంస్థ తరఫున సన్మాన పత్రము సమర్పించి శాలువాతో సత్కరించారు. ఈ పదవీ విరమణ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ న్యాయమూర్తులు ఎస్ . శివకుమార్, అదనపు న్యాయమూర్తి డి .వెంకటేష్, సీనియర్ అడిషనల్ సివిల్ జడ్జి జమాన వెంకట సత్యనారాయణ రాజు కిరణ్ తదితరులు ముఖ్య అతిథులుగా వేదికను అలంకరించారు. జిల్లా న్యాయస్థానం ఉద్యోగుల సంఘం రిటైర్డ్ అవుతున్న శివ నారాయణ గారి దంపతులను శాలు ఘనంగా సత్కరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!