జిల్లా న్యాయస్థానం పర్యవేక్షకుడు వాసం శివ నారాయణ పదవీ విరమణ

కరీంనగర్ (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా న్యాయస్థానంలో సీనియర్ పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న వాసం శివ నారాయణ పదవి విరమణ ఉత్సవము మంగళవారం సాయంత్రం జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగింది. 28 ఏళ్ల సర్వీస్ ఉన్న శివ నారాయణ గారు తెలుగు సారస్వతములో దిట్ట. స్వయంగా పద్యకవి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాహితీవేత్తలు పలువురు పాల్గొని సాహితీవేత్త అయిన శివ నారాయణ గారిని ఘనంగా సన్మానించారు. కరీంనగర్ శరత్ సాహితీ కళా స్రవంతి అధ్యక్ష ,కార్యదర్శులు డాక్టర్ సబ్బరి లక్ష్మీనారాయణ, సంకేపల్లి నాగేంద్ర శర్మ, సాహితీవేత్తలు వెలమల...