Tuesday, June 30, 2026
Homeజాతీయంగ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది: శివరాజ్‌సింగ్

గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది: శివరాజ్‌సింగ్

📰 Generate e-Paper Clip

గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు.

న్యూఢిల్లీ, జూన్ 29(చైతన్యగళం): తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ పథకాల అమలులో తెలంగాణ వెనుకబడి ఉందన్నారు. సోమవారం న్యూఢిల్లీలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలుపై మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 27 రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన మాట్లాడుతూ.. పీఎంజీఏసీవై రహదారుల పనులు వేగవంతం కావాలని పేర్కొన్నారు. పెండింగ్ రహదారి పనులు పూర్తి చేయాలని సూచించారు. పీఎం ఆవాస్ సర్వే త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ గ్రామీణాభివృద్ధి మంత్రితోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని వారికి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

నిధుల వాటా విడుదల చేయండి: శివరాజ్ సింగ్

అలాగే గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది కావాలని ఆయన ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు. జులై 1వ తేదీ నుంచి వికసిత్ భారత్ గ్రామీణ యోజన అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిధుల వాటా సమయానికి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ కోరారు.

 

ఏపీపై కేంద్ర మంత్రి ప్రశంసలు..

గ్రామీణాభివృద్ధి పథకాల అమలులో ముందంజలో ఉందంటూ ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ ప్రశంసలు కురిపించారు. వీబీజీఆర్‌ఎంఏజీఐ (VBGRMAJI)కి నోటిఫికేషన్ పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ ఉందన్నారు. జులై 2వ తేదీన తిరుపతిలో వీబీజీఆర్‌ఎంఏజీఐ ప్రారంభిస్తామని ప్రకటించారు.

జాతీయ ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేశామన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (PMGSY) నాణ్యతలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాల్లో ఏపీకి స్థానం దక్కిందని మంత్రి శివరాజ్‌సింగ్ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!