గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది: శివరాజ్‌సింగ్

గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు. న్యూఢిల్లీ, జూన్ 29(చైతన్యగళం): తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ పథకాల అమలులో తెలంగాణ వెనుకబడి ఉందన్నారు. సోమవారం న్యూఢిల్లీలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలుపై మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 27 రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ...