- సర్పంచ్ అభ్యర్థిగా మందాడి దొరబాబు రెడ్డి నామినేషన్ దాఖలు
నందికొట్కూరు, నవంబర్ 22 (నీలగిరి ఎక్స్‌ప్రెస్):
జూపాడుబంగ్లా మండలం తరిగొప్పుల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మందాడి దొరబాబు రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంద్యాల టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి మండల శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆశీస్సులతో తరిగొప్పుల, రామసముద్రం గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
గ్రామాల్లో రహదారులు, తాగునీరు, మురుగునీటి కాలువలు, వీధి దీపాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, యువత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ గ్రామాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
గ్రామాభివృద్ధికి తనకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ యువ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

