తరిగొప్పుల సమగ్ర అభివృద్ధే లక్ష్యం
సర్పంచ్ అభ్యర్థిగా మందాడి దొరబాబు రెడ్డి నామినేషన్ దాఖలు నందికొట్కూరు, నవంబర్ 22 (నీలగిరి ఎక్స్‌ప్రెస్): జూపాడుబంగ్లా మండలం తరిగొప్పుల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మందాడి దొరబాబు రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంద్యాల టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి మండల శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆశీస్సులతో తరిగొప్పుల, రామసముద్రం గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో రహదారులు, తాగునీరు, మురుగునీటి కాలువలు, వీధి దీపాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తన ప్రధాన...