Sunday, November 22, 2026
Homeతెలంగాణరాజ్యాంగ దినోత్సవ మహాసభను విజయవంతం చేయాలి

రాజ్యాంగ దినోత్సవ మహాసభను విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

  • తలకొండపల్లిలో రాజ్యాంగ దినోత్సవ గోడపత్రికల ఆవిష్కరణ

తలకొండపల్లి, నవంబర్‌ 22 (చైతన్యగళం): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ మహాసభను విజయవంతం చేయాలని బహుజన నాయకులు పిలుపునిచ్చారు. హైకోర్టు న్యాయవాది డాక్టర్‌ కదిరి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ మహాసభకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరుకానున్న నేపథ్యంలో సభకు సంబంధించిన గోడపత్రికలను తలకొండపల్లి మండలంలో ఆవిష్కరించారు.

బహుజన సేన మండల అధ్యక్షుడు అశ్వ యాదయ్య ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్‌ లలిత జోతయ్య, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు దుబ్బ చెన్నయ్య, బహుజన సేన జిల్లా అధికార ప్రతినిధి వర్కాల శేఖర్‌ తదితరులు గోడపత్రికలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా దుబ్బ చెన్నయ్య, లలిత జోతయ్య మాట్లాడుతూ.. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌పై ఇటీవల కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలు, అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్‌ ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సమానత్వం, సామాజిక న్యాయంపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు.

అంబేద్కర్‌ చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగా నేడు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో అవకాశాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు.

ఈ నెల 26న నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ మహాసభకు బహుజన నాయకులు, వివిధ రాజకీయ పార్టీల అఖిలపక్ష నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్‌ వాదులు, విద్యార్థులు, మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు, ఆర్థికవేత్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ మండల ఉపాధ్యక్షుడు దైవానందం, యాదవ బీసీ సంఘం నాయకుడు కటికల పాండు, మండల మేదరి సంఘం అధ్యక్షుడు మేదరి నరసింహ, పేరుమల్ల జగన్‌, అంబేద్కర్‌ సంఘం సభ్యుడు చేపునుంతల మల్లేష్‌, వార్డు సభ్యురాలు మల్లీశ్వరి, జంగయ్య, నరసింహ, బొజ్జ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!