రాజ్యాంగ దినోత్సవ మహాసభను విజయవంతం చేయాలి
తలకొండపల్లిలో రాజ్యాంగ దినోత్సవ గోడపత్రికల ఆవిష్కరణ తలకొండపల్లి, నవంబర్ 22 (చైతన్యగళం): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ మహాసభను విజయవంతం చేయాలని బహుజన నాయకులు పిలుపునిచ్చారు. హైకోర్టు న్యాయవాది డాక్టర్ కదిరి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ మహాసభకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరుకానున్న నేపథ్యంలో సభకు సంబంధించిన గోడపత్రికలను తలకొండపల్లి మండలంలో ఆవిష్కరించారు. బహుజన సేన మండల అధ్యక్షుడు అశ్వ యాదయ్య ఆధ్వర్యంలో...