- ఎంపికైన క్రీడాకారులను సత్కరించిన ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల అసోసియేషన్
హుస్నాబాద్, నవంబర్ 21 (చైతన్యగళం): ఉమ్మడి మెదక్ జిల్లా కబడ్డీ జట్టుకు హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడం అభినందనీయమని ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులను అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తే వారు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశాలు మెరుగుపడతాయని నిర్వాహకులు తెలిపారు.
క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ హైస్కూల్ ప్రిన్సిపాల్ విజయేందర్‌రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అరవింద్, కార్యదర్శి రాజారెడ్డి, కోశాధికారి సంపత్, సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్, ఈసీ సభ్యులు అజయ్, స్రవంతి, కవిత, మాధవి, లావణ్య, కళావతి పాల్గొన్నారు.

