Tuesday, October 13, 2026
Homeతెలంగాణకరీంనగర్అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - సుడా కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి – సుడా కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌

📰 Generate e-Paper Clip

  • నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలి
  • పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలి

కరీంనగర్‌, అక్టోబర్‌ 12 (చైతన్యగళం): శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌ నగర అభివృద్ధిలో భాగంగా సోమవారం సుడా కార్యాలయంలో ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులతో పాటు పూర్తయినవి, ప్రారంభించాల్సిన పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు (డీఈ), సహాయ ఇంజినీర్ల (ఏఈ) వారీగా పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ప్రారంభం కాని పనుల స్థితిగతులపై ఆరా తీసి, వాటిని వెంటనే చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ మాట్లాడుతూ.. సుడా పరిధిలో చేపట్టిన పనులతో పాటు నగరపాలక సంస్థ ద్వారా వివిధ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. టెండర్లు పూర్తయినా ఇప్పటివరకు పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.

కరీంనగర్‌ నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో కార్యనిర్వాహక ఇంజినీర్‌ లచ్చిరెడ్డి, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈలు సతీష్‌, భీంవర్ధన్‌తో పాటు సుడా ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!