అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి – సుడా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలి పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలి కరీంనగర్, అక్టోబర్ 12 (చైతన్యగళం): శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా సోమవారం సుడా కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులతో పాటు పూర్తయినవి, ప్రారంభించాల్సిన పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు....