శంకరపట్నం, అక్టోబర్ 12 (చైతన్యగళం): ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని బీజేపీ అధికార ప్రతినిధి అలివేల సమ్మిరెడ్డి అన్నారు. ఆదివారం శంకరపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతోపాటు, నకిలీ, మరణించిన వ్యక్తుల ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ లక్ష్యమని పేర్కొన్నారు.
ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు అందుకు సంబంధించిన ఆధారాలను చూపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం చేపట్టే సంస్కరణలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్, నాయకులు దొంగల రాములు, జంగ జైపాల్, కొయ్యడ అశోక్, నిమ్మిశెట్టి సంపత్, సుదగోని శ్రీనివాస్, మందాడి జగ్గారెడ్డి, రాసమల్ల శ్రీనివాస్, చెర్ల శ్రీనివాస్, కనకం కుమార్, కాంతాల రాజిరెడ్డి, వడ్లకొండ రాజేందర్, కూనారపు శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
