Monday, October 5, 2026
Homeతెలంగాణకరీంనగర్అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్ లు పట్టివేత

అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్ లు పట్టివేత

📰 Generate e-Paper Clip

కరీంనగర్ అక్టోబర్ 5 (చైతన్యగళం):

ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. ఈ మేరకు కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్. నిరంజన్ రెడ్డి తెలిపారు.

కరీంనగర్ రూరల్ ఎస్సై ఎ. లక్ష్మారెడ్డి తన సిబ్బందితో కలిసి సోమవారం ఉదయం నుంచి రూరల్ మండల పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి వాగు నుంచి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను కరీంనగర్ వైపు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ముగ్దుంపూర్ వద్ద ఒక ట్రాక్టర్, దుర్షేడు వద్ద రెండు ట్రాక్టర్లు, లారీ అసోసియేషన్ సమీపంలో మరో ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు.

పట్టుబడిన ట్రాక్టర్లకు సంబంధించి యజమానులు, డ్రైవర్లుగా గొబ్బల విశ్వనాథరెడ్డి, గొబ్బల విలాసరెడ్డి, దాసరి సంపత్, వీర్ల సంపత్, సప్పట్ల సంపత్, పున్న గంగరాజు, దాసరి శ్రీనివాస్ తదితరులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు వారు అంగీకరించినట్లు పేర్కొన్నారు.

నాలుగు ట్రాక్టర్లను పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకుని, సంబంధిత యజమానులు, డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

అక్రమ ఇసుక రవాణాకు పాల్పడకుండా ఉండేందుకు సంబంధిత వ్యక్తులపై కరీంనగర్ రూరల్ తహసీల్దార్ వద్ద బైండోవర్ చర్యలు చేపట్టనున్నట్లు ఇన్‌స్పెక్టర్ ఎన్. నిరంజన్ రెడ్డి తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల పరిధిలో ఎంతటి వారైనా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు, రవాణా, అక్రమ విక్రయాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!