- జాన్ విల్సన్ లోకల్ ఆటో స్టాండ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
హుస్నాబాద్, అక్టోబర్ 5 (చైతన్యగళం): హుస్నాబాద్ పట్టణంలోని స్వర్గీయ జాన్ విల్సన్ ఎస్సై లోకల్ ఆటో స్టాండ్ నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ ఫయాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆటో యూనియన్ నాయకులు సోమవారం ప్రకటించారు.
వైస్ ప్రెసిడెంట్‌గా తాళ్లపల్లి రాజుగౌడ్, కోశాధికారిగా తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికైనట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వారి సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. నూతన కార్యవర్గానికి ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.
