Tuesday, September 29, 2026
Homeజాతీయంఢిల్లీరూ.3 వేల మందుకు రూ.27 వేల ఎంఆర్‌పీ ఎలా?

రూ.3 వేల మందుకు రూ.27 వేల ఎంఆర్‌పీ ఎలా?

📰 Generate e-Paper Clip

  • ఔషధాల ధరల వ్యత్యాసంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29 (చైతన్యగళం): క్యాన్సర్‌ మందులు, వైద్య పరికరాల తయారీ వ్యయం, చిల్లర ధరల మధ్య భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం ఈ అంశంపై విచారణ సందర్భంగా.. రిటైలర్‌కు రూ.3 వేలకే లభించే క్యాన్సర్‌ మందుకు రూ.27 వేల ఎంఆర్‌పీ ఎలా నిర్ణయిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

మందులు, వైద్య పరికరాలను ప్రజలకు అత్యవసరమైనవిగా పరిగణించినప్పుడు వాటి ధరల నియంత్రణకు మరింత సమర్థవంతమైన విధానం ఎందుకు తీసుకురావడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. రిటైలర్‌ ధరపై ఎంఆర్‌పీని 16 శాతానికి మించి పెంచకుండా పరిమితి విధించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. కొన్ని మందుల ధరలు రిటైలర్‌ ధర కంటే అనేక రెట్లు అధికంగా ఉండటానికి కారణమేంటని ప్రశ్నించింది.

అధిక ఎంఆర్‌పీల వల్ల ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద ప్రజాధనంపై అదనపు భారం పడే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఔషధ తయారీదారులు, విక్రేతలు, ఆస్పత్రులు, రోగుల ప్రయోజనాలను సమతుల్యం చేసే పరిష్కారం కనుగొంటామని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను అక్టోబరు 12కు వాయిదా వేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!