రూ.3 వేల మందుకు రూ.27 వేల ఎంఆర్‌పీ ఎలా?

ఔషధాల ధరల వ్యత్యాసంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, సెప్టెంబరు 29 (చైతన్యగళం): క్యాన్సర్‌ మందులు, వైద్య పరికరాల తయారీ వ్యయం, చిల్లర ధరల మధ్య భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం ఈ అంశంపై విచారణ సందర్భంగా.. రిటైలర్‌కు రూ.3 వేలకే లభించే క్యాన్సర్‌ మందుకు రూ.27 వేల ఎంఆర్‌పీ ఎలా నిర్ణయిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మందులు, వైద్య పరికరాలను ప్రజలకు అత్యవసరమైనవిగా పరిగణించినప్పుడు వాటి ధరల నియంత్రణకు మరింత సమర్థవంతమైన విధానం ఎందుకు తీసుకురావడం లేదని...