Monday, September 28, 2026
Homeతెలంగాణకూరగాయల సాగుతో రైతులకు అదనపు ఆదాయం

కూరగాయల సాగుతో రైతులకు అదనపు ఆదాయం

📰 Generate e-Paper Clip

  • పంట మార్పిడితో సాగు విస్తరణకు ‘మిషన్ వైవిధ్యం’ – 10 వేల ఎకరాల లక్ష్యం

బయ్యారం, సెప్టెంబర్ 26(చైతన్యగళం): పంటల వైవిధ్యంతో రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు కూరగాయల సాగును విస్తృతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ వైవిధ్యం’ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో కూరగాయలకు భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం సుమారు 2 వేల ఎకరాల్లోనే సాగవుతున్న నేపథ్యంలో, సాగు విస్తీర్ణాన్ని 10 వేల ఎకరాలకు పెంచే లక్ష్యంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం బయ్యారం మండలం నామాలపాడు గ్రామంలో కూరగాయల సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న పరిశీలించారు.

వరి, మొక్కజొన్న, పత్తి, మిరప వంటి సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగును చేపడితే తక్కువ విస్తీర్ణంలోనే అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఎల్నినో పరిస్థితుల్లో నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంట మార్పిడికి రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

నామాలపాడు గ్రామానికి చెందిన రైతు వాంకుడోతు దోసిలాల్ సాగు చేస్తున్న కాకర, చిక్కుడు తదితర కూరగాయల పంటలను అధికారులు పరిశీలించారు. తాత్కాలిక పందిరి విధానంలో కాకర సాగు చేస్తూ వానాకాలం, యాసంగి సీజన్లలో ఎకరానికి రూ.2 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆధునిక యాజమాన్య పద్ధతులతో కూరగాయల సాగు చేస్తున్న దోసిలాల్ మండలంలోని ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!