కూరగాయల సాగుతో రైతులకు అదనపు ఆదాయం
పంట మార్పిడితో సాగు విస్తరణకు ‘మిషన్ వైవిధ్యం’ – 10 వేల ఎకరాల లక్ష్యం బయ్యారం, సెప్టెంబర్ 26(చైతన్యగళం): పంటల వైవిధ్యంతో రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు కూరగాయల సాగును విస్తృతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ వైవిధ్యం’ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో కూరగాయలకు భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం సుమారు 2 వేల ఎకరాల్లోనే సాగవుతున్న నేపథ్యంలో, సాగు విస్తీర్ణాన్ని 10 వేల ఎకరాలకు పెంచే లక్ష్యంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం బయ్యారం మండలం నామాలపాడు...