Friday, September 25, 2026
Homeతెలంగాణవాటర్ ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

వాటర్ ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్, సెప్టెంబర్ 24 (చైతన్యగళం): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు బాలవికాస సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కేడం లింగమూర్తి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిర్నీబాయి, రాజ్యా తండా, పీజీ తండా తదితర గ్రామాల్లో బాలవికాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లను ఆయన సందర్శించి పరిశీలించారు.

ప్లాంట్ల పనితీరు, నిర్వహణ, రికార్డులు, ప్రజలకు తాగునీటి సరఫరా విధానాన్ని పరిశీలించారు. యంత్ర పరికరాల లోపాలతో పనిచేయని ప్లాంట్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు. పలు రాష్ట్రాల్లో సుమారు 1,600 వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నామని, అవసరమైన గ్రామాల్లో కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని లింగమూర్తి తెలిపారు.

హుస్నాబాద్‌లో ప్రస్తుతం బాలవికాస ఆధ్వర్యంలో ఒక వాటర్ ప్లాంట్ పనిచేస్తోందని, త్వరలో మరో రెండు ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాల్లో సంస్థ చీఫ్ మేనేజర్ ఫ్రాన్సిస్‌రెడ్డి, మేనేజర్ మధుసూదన్‌రెడ్డి, జోనల్ డైరెక్టర్లు కృష్ణారెడ్డి, యాకూబ్‌రెడ్డి, జోనల్ సమన్వయకర్త నరేష్, క్షేత్ర సమన్వయకర్త మల్లారావు, సంస్థ ప్రతినిధులు, సభ్యులు, గ్రామాల సమన్వయకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!