వాటర్ ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

హుస్నాబాద్, సెప్టెంబర్ 24 (చైతన్యగళం): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు బాలవికాస సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కేడం లింగమూర్తి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిర్నీబాయి, రాజ్యా తండా, పీజీ తండా తదితర గ్రామాల్లో బాలవికాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లను ఆయన సందర్శించి పరిశీలించారు. ప్లాంట్ల పనితీరు, నిర్వహణ, రికార్డులు, ప్రజలకు తాగునీటి సరఫరా విధానాన్ని పరిశీలించారు. యంత్ర పరికరాల లోపాలతో పనిచేయని ప్లాంట్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి తిరిగి...