- బోధన, సామాజిక సేవలకు గుర్తింపుగా పురస్కారం
అక్కన్నపేట, సెప్టెంబరు 21 (చైతన్యగళం): అక్కన్నపేట మండలం అంతకపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక, రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చింతకింది శ్రీనివాస్‌కు ‘ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు–2026’ లభించింది. హైదరాబాద్‌లోని జటాధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో హరిహర భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి చేతుల మీదుగా శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు.
విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయడంతో పాటు బోధన, సామాజిక సేవా కార్యక్రమాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అవార్డు అందుకున్న శ్రీనివాస్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భదావత్ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, ఏఏపీసీ చైర్మన్, సభ్యులు అభినందించారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని శ్రీనివాస్ తెలిపారు.
