Tuesday, October 13, 2026
Homeతెలంగాణగౌరవెల్లి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి - బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్‌ ముదిరాజు

గౌరవెల్లి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్‌ ముదిరాజు

📰 Generate e-Paper Clip

అక్కన్నపేట, సెప్టెంబర్‌ 21 (చైతన్యగళం): అక్కన్నపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు రామంచ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్‌ ముదిరాజు ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గ్రామంలోని బూత్‌ స్థాయిలో ప్రజలకు విస్తృతంగా వివరించాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్‌ నియోజకవర్గ రైతులకు ఉపయోగపడే గౌరవెల్లి–గండిపల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు పనుల్లో జాప్యాన్ని నివారించి పూర్తిస్థాయిలో పనులు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే విద్యుత్‌ కార్యాలయాల ముట్టడి చేపడతామని తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. అక్కన్నపేట మండలంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

సమావేశంలో మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం, మండల ఇన్‌చార్జి మాచర్ల కుమార్‌స్వామిగౌడ్‌, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు రజనీకర్‌రెడ్డి, జిల్లా కోఆపరేటివ్‌ సెల్‌ కన్వీనర్‌ వేణుగోపాలరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, బూత్‌ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!