గౌరవెల్లి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్ ముదిరాజు
అక్కన్నపేట, సెప్టెంబర్ 21 (చైతన్యగళం): అక్కన్నపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు రామంచ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్ ముదిరాజు ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గ్రామంలోని బూత్ స్థాయిలో ప్రజలకు విస్తృతంగా వివరించాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గ రైతులకు ఉపయోగపడే గౌరవెల్లి–గండిపల్లి ప్రాజెక్టును...