కరీంనగర్, సెప్టెంబర్ 19 (చైతన్యగళం):
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ శుక్రవారం జమ్మికుంటలోని నాయిని చెరువు, పలు గణేష్ మండపాలతో పాటు హుజురాబాద్‌లోని గణేష్ మండపాలు, నిమజ్జన కేంద్రాలను పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు, వాహనాల రాకపోకలు, పార్కింగ్, విద్యుత్, వెలుతురు, బారికేడింగ్, సీసీ కెమెరాల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.
గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మండపాల నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిమజ్జన కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి, ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ, కరుణాకర్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
