హుజురాబాద్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉత్సవ సమితిని శుక్రవారం ఎన్నుకున్నారు. సమితి అధ్యక్షుడిగా ఈదులకంటి రవీందర్‌రెడ్డిని నియమించినట్లు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సేవా ప్రముఖ్ కోమళ్ల రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర గోశాల సంపర్క ప్రముఖ్ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శ్యామ్, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు.
కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శ్యామ్, మండల అధ్యక్షుడు కంకణాల రమేష్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొమురవెల్లి రాజు, పట్టణ కార్యదర్శి కనకం శ్రీనివాస్, నాయకులు గుంటి శ్రీనివాస్, కందుల శ్రీనివాస్‌రెడ్డి, అంగీరక ప్రసాద్, కుసుమ సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
