ఉత్సవ సమితి అధ్యక్షుడిగా రవీందర్‌రెడ్డి
హుజురాబాద్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉత్సవ సమితిని శుక్రవారం ఎన్నుకున్నారు. సమితి అధ్యక్షుడిగా ఈదులకంటి రవీందర్‌రెడ్డిని నియమించినట్లు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సేవా ప్రముఖ్ కోమళ్ల రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర గోశాల సంపర్క ప్రముఖ్ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శ్యామ్, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు....