Wednesday, September 2, 2026
Homeతెలంగాణహైదరాబాద్ఘనంగా ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

  • యెర్రం విజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన వారోత్సవాలు
  • ప్రతి భారతీయుడికి జీవిత బీమా రక్షణే లక్ష్యం: జోనల్ మేనేజర్ శ్రవణ్ రమేష్
  • ఏజెంట్లే ఎల్‌ఐసీకి నిజమైన బలం – కౌటికె విఠల్

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (చైతన్యగళం):
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) 70వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో గల సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను పరిధిలోకి తీసుకున్న సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ శ్రవణ్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వారోత్సవాలకు ప్రముఖ పారిశ్రామికవేత్త, వాసవి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ యెర్రం విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయంలోని వివిధ విభాగాల రీజనల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎల్‌ఐసీ 70 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానానికి ప్రతీకగా ఈ కార్యక్రమం నిలిచింది.ఈ సందర్భంగా యెర్రం విజయ్ కుమార్ మాట్లాడుతూ, భారతీయ జీవిత బీమా సంస్థ 70 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసి, శతాబ్ది ఉత్సవాల దిశగా మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గ్యారెంటీ, విశ్వాసం, ఆర్థిక భద్రతకు ప్రతీకగా ఎల్‌ఐసీ నిలిచిందని పేర్కొన్నారు.పిల్లల విద్య, ఉన్నత చదువులు, వివాహం, కుటుంబ భద్రత, పదవీ విరమణ అనంతర జీవితం వంటి ప్రతి ముఖ్య దశలో జీవిత బీమా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఎల్‌ఐసీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఉద్యోగులు, ఏజెంట్లు, డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్లను అభినందించారు.

2047 నాటికి ప్రతి భారతీయుడికి బీమా రక్షణ

జోనల్ మేనేజర్ శ్రవణ్ రమేష్ మాట్లాడుతూ, ఎల్‌ఐసీ గత 70 సంవత్సరాలుగా కోట్లాది భారతీయ కుటుంబాలకు జీవిత బీమా భద్రత అందించడమే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.”2047 నాటికి దేశంలోని ప్రతి భారతీయుడికి జీవిత బీమా రక్షణ అందించాలన్నదే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. పాలసీదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి అధికారులు, ఉద్యోగులు మరింత అంకితభావంతో పనిచేస్తారని తెలిపారు.

ఏజెంట్లే ఎల్‌ఐసీకి నిజమైన బలం – కౌటికె విఠల్

కార్యక్రమంలో ప్రముఖ జీవిత బీమా నాయకులు కౌటికె విఠల్ మాట్లాడుతూ, జీవిత బీమా ఏజెంట్లే ఎల్‌ఐసీకి అసలైన బలమని అన్నారు. పాలసీదారులు మరియు సంస్థ మధ్య వారధిగా నిలుస్తూ ఏజెంట్లు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.పాలసీదారుల సంతృప్తియే ఏజెంట్లకు నిజమైన సంతృప్తి అని తెలిపారు. దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న జీవిత బీమా ఏజెంట్లందరికీ, అలాగే ఎల్‌ఐసీని విశ్వసిస్తున్న కోట్లాది పాలసీదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఎల్‌ఐసీ 70 సంవత్సరాల ప్రస్థానం కేవలం ఒక సంస్థ విజయగాథ మాత్రమే కాకుండా, కోట్లాది భారతీయ కుటుంబాల ఆశలకు, కలలకు, ఆర్థిక భద్రతకు అండగా నిలిచిన మహోన్నత ప్రయాణమని పలువురు వక్తలు పేర్కొన్నారు.”యోగక్షేమం వహామ్యహమ్”అనే ధ్యేయంతో గత ఏడు దశాబ్దాలుగా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్న ఎల్‌ఐసీ, రాబోయే రోజుల్లో మరింత మంది భారతీయులకు జీవిత బీమా రక్షణ అందిస్తూ శతాబ్ది దిశగా విజయవంతంగా ముందుకు సాగాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!