ఘనంగా ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవ వేడుకలు
యెర్రం విజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన వారోత్సవాలు ప్రతి భారతీయుడికి జీవిత బీమా రక్షణే లక్ష్యం: జోనల్ మేనేజర్ శ్రవణ్ రమేష్ ఏజెంట్లే ఎల్‌ఐసీకి నిజమైన బలం - కౌటికె విఠల్ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (చైతన్యగళం): భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) 70వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో గల సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను పరిధిలోకి తీసుకున్న సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం...