Wednesday, September 2, 2026
Homeతెలంగాణనల్గొండపదోన్నతిపై బదిలీ అవుతున్న న్యాయమూర్తికి ఘన సన్మానం

పదోన్నతిపై బదిలీ అవుతున్న న్యాయమూర్తికి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

మిర్యాలగూడ, సెప్టెంబర్ 1(చైతన్యగళం): స్థానిక కోర్టులో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా విధులు నిర్వహించిన పి.పవన్‌కుమార్‌కు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పదోన్నతి లభించడంతోపాటు రంగారెడ్డి జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శిగా నియామకం కావడంతో మిర్యాలగూడ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా 5వ అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి కె.వి.చంద్రశేఖరరావు మాట్లాడుతూ ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయడంలో పవన్‌కుమార్‌ సమర్థవంతంగా పనిచేస్తారని అన్నారు.

మిర్యాలగూడలో విధులు నిర్వహించిన సమయంలో కేసుల పరిష్కారానికి ఆయన చూపిన శ్రద్ధ, చొరవ అభినందనీయమని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గౌరు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.అర్జున్‌, జడ్జీలు ఎం.లావణ్యరాణి, అరుణ్‌తేజ్‌, సీనియర్‌ న్యాయవాది లింగంపల్లి అంజయ్య తదితరులు పవన్‌కుమార్‌ సేవలను కొనియాడారు. నూతన బాధ్యతల్లోనూ సమర్థవంతంగా పనిచేసి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

అనంతరం బార్‌ అసోసియేషన్‌ తరఫున పవన్‌కుమార్‌ను శాలువా, మెమొంటోతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!