పదోన్నతిపై బదిలీ అవుతున్న న్యాయమూర్తికి ఘన సన్మానం

మిర్యాలగూడ, సెప్టెంబర్ 1(చైతన్యగళం): స్థానిక కోర్టులో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా విధులు నిర్వహించిన పి.పవన్‌కుమార్‌కు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పదోన్నతి లభించడంతోపాటు రంగారెడ్డి జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శిగా నియామకం కావడంతో మిర్యాలగూడ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా 5వ అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి కె.వి.చంద్రశేఖరరావు మాట్లాడుతూ ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయడంలో పవన్‌కుమార్‌ సమర్థవంతంగా పనిచేస్తారని అన్నారు. మిర్యాలగూడలో విధులు నిర్వహించిన సమయంలో కేసుల పరిష్కారానికి ఆయన చూపిన శ్రద్ధ, చొరవ అభినందనీయమని...