- 13 మంది సభ్యుల ఎన్నిక.. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని సీపీ గౌష్ ఆలం సూచన
కరీంనగర్, ఆగస్టు 20 (చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. మొత్తం 34 మంది ప్రతినిధుల నుంచి 13 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం పోలీసు సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సమన్వయంతో పనిచేయాలని సీపీ గౌష్ ఆలం సూచించారు.
అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏ. సతీష్ (పీసీ 3108) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బి. శ్రీనివాస్ (ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్), బి. వంశీకృష్ణ (ఎస్‌ఐ) ఎన్నికయ్యారు. కార్యదర్శిగా సీహెచ్. నర్సింహారావు (ఎస్‌ఐ), సంయుక్త కార్యదర్శిగా ఏ. శ్రీనివాస్ (హెడ్ కానిస్టేబుల్ 2166), ఆర్గనైజింగ్ సెక్రటరీగా జె. ఓదయ్య (పీసీ 3514), కోశాధికారిగా ఆర్. చంద్ర మౌళి (పీసీ 1834) ఎన్నికయ్యారు.
యూనిట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎం. ప్రవీణ్‌రెడ్డి (ఏఆర్ పీసీ 2868), వి. మల్లేశం (ఏఆర్ హెచ్‌సీ 2612), బి. శ్రీధర్ (పీసీ 3302), ఏ. తిరుపతి (పీసీ 626), కె. మహేష్ (పీసీ 3018), వి. శైలజ (డబ్ల్యూపీసీ 576) ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గం పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేయాలని, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోలీసు సిబ్బంది సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు కార్యవర్గ సభ్యులంతా సమన్వయంతో పనిచేస్తామని నూతన సభ్యులు తెలిపారు.
