Friday, August 21, 2026
Homeతెలంగాణ31వ వార్డులో ఘనంగా బోనాల ఉత్సవాలు

31వ వార్డులో ఘనంగా బోనాల ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

మానుకోట, ఆగస్టు 19(చైతన్యగళం): మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డులో బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలను నెత్తిన ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల వేడుకలతో 31వ వార్డులో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ జ్యోతి మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన వార్డు ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో వార్డు ప్రజలు, మహిళలు, భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!