Tuesday, August 11, 2026
Homeతెలంగాణఏకలవ్య పాఠశాలలో వైభవంగా బోనాల వేడుకలు

ఏకలవ్య పాఠశాలలో వైభవంగా బోనాల వేడుకలు

📰 Generate e-Paper Clip

  • ఎల్లమ్మ దేవాలయంలో బోనం సమర్పించిన విద్యార్థులు.. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు

వెల్దండ, ఆగస్టు 10 (చైతన్యగళం): వెల్దండ మండల పరిధిలోని గుండాల గ్రామంలో ఉన్న ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ సుమన్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

బోనాల పండుగ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గుండాల గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయానికి బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పాఠశాల, విద్యార్థుల సంక్షేమం కోసం ప్రార్థించారు. సంప్రదాయ ఆచారాలతో నిర్వహించిన ఈ వేడుకలతో పాఠశాల పరిసరాల్లో పండుగ సందడి నెలకొంది.

విద్యార్థుల్లో మన సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాల పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు వాటి విశిష్టతను తెలియజేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పాఠశాల వర్గాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్ కోడెం భాస్కర్, ఉపాధ్యాయులు అనీషా, ధర్మేందర్, అనూష, మల్లికతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!