ఏకలవ్య పాఠశాలలో వైభవంగా బోనాల వేడుకలు

ఎల్లమ్మ దేవాలయంలో బోనం సమర్పించిన విద్యార్థులు.. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు వెల్దండ, ఆగస్టు 10 (చైతన్యగళం): వెల్దండ మండల పరిధిలోని గుండాల గ్రామంలో ఉన్న ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ సుమన్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాల పండుగ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గుండాల గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయానికి బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పాఠశాల, విద్యార్థుల సంక్షేమం కోసం...