Thursday, August 6, 2026
Homeతెలంగాణసిద్ధిపేటతల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం

తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్, ఆగస్టు 5 (చైతన్యగళం):

హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మొదటి, ఐదవ వార్డుల్లో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ, ప్రతి తల్లి శిశువు పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించి, తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, సరైన పోషకాహారం, శిశు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు చెన్నోబోయిన అనూష, బొల్లిశెట్టి రాజు, సీడీపీవో, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!