వర్ధన్నపేట, ఆగస్టు 3(చైతన్యగళం): అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు వేదికగా నిలుస్తున్న 19వ తానా మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక మహాసభలకు ఇల్లంద గ్రామ వాస్తవ్యులు గొడిశాల శ్యాంప్రసాద్ హాజరై వివిధ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చిన తెలుగు ప్రముఖులు, ప్రవాస భారతీయులతో కలిసి ఆయన సమావేశాల్లో పాల్గొని తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి, భావితరాలకు తెలుగు సంప్రదాయాలను చేరవేసే అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
తానా మహాసభల్లో ప్రముఖుల ప్రసంగాలు, యువజన సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు భాష, సంస్కృతి, కళలు, సంప్రదాయాల పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిగాయి.
ఇల్లంద గ్రామానికి చెందిన గొడిశాల శ్యాంప్రసాద్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న తానా మహాసభలకు హాజరై వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం గ్రామ ప్రజలకు గర్వకారణమని పలువురు అభినందనలు తెలిపారు.
