Wednesday, July 29, 2026
Homeతెలంగాణరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన శాతవాహన ఉపకులపతి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన శాతవాహన ఉపకులపతి

📰 Generate e-Paper Clip

కరీంనగర్, జూలై 27 (చైతన్యగళం):
శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు. ఉమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి *శ్రీ సంజయ్ జాజు ఐ.ఏ.ఎస్.*ను హైదరాబాద్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సి.ఎస్.గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను పచ్చటి మొక్కతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా శాతవాహన విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విద్యా, పరిశోధనా కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన గురించిన వివరాలను ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి, విశ్వవిద్యాలయ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు.

సానుకూలంగా స్పందించిన చీఫ్ సెక్రటరీ శ్రీ సంజయ్ జాజు, “శాతవాహన విశ్వవిద్యాలయ అభివృద్ధికి, విద్యార్థుల పురోగతికి ప్రభుత్వం తరఫున తగిన మద్దతు అందిస్తాం” అని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!