Thursday, July 23, 2026
Homeతెలంగాణకరీంనగర్కరీంనగర్‌లో వరుస చోరీలు.. ప్రజల్లో భయాందోళన

కరీంనగర్‌లో వరుస చోరీలు.. ప్రజల్లో భయాందోళన

📰 Generate e-Paper Clip

కరీంనగర్, జూలై 23 (చైతన్య గళం):

కరీంనగర్ నగరంలో వరుసగా జరుగుతున్న చోరీలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మే 3న నగరంలోని పీఎంజే నగల దుకాణంలో జరిగిన భారీ దోపిడీ ఘటన ప్రభావం ఇంకా తగ్గకముందే, మంగళవారం అర్ధరాత్రి మరో ఇంట్లో భారీ చోరీ చోటుచేసుకుంది. అనంతరం బుధవారం మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వావిలాలపల్లిలో మరో ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడి సుమారు రూ.4.80 లక్షల నగదును అపహరించారు. వరుస ఘటనలతో నగరవాసులు భయాందోళనకు గురవుతుండగా, రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!