ఓటరు జాబితా ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి – కలెక్టర్ హైమావతి
సిద్దిపేట, సెప్టెంబర్ 1(చైతన్యగళం(: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఎస్‌ఐఆర్–2026లో భాగంగా జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,175 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబితా ప్రకారం 4,28,861 మంది పురుషులు, 4,45,273 మంది...