గౌరవెల్లి కాలువల భూసేకరణ వేగవంతం

సెప్టెంబర్‌ 15లోగా రైతులకు పరిహారం చెల్లించాలి హుస్నాబాద్, ఆగస్టు 31 (చైతన్యగళం): గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసిందని, నిధులను సద్వినియోగం చేసుకుంటూ కాలువల భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులతో సమావేశమైన మంత్రి గౌరవెల్లి ప్రాజెక్టు ప్రధాన ఎడమ, కుడి కాలువల భూసేకరణ, నిర్మాణ పనులపై సమీక్షించారు కాలువల నిర్మాణానికి 559...