రహదారి పక్కన చెత్త వేస్తే చర్యలు

హుజురాబాద్ , ఆగస్టు 27 (చైతన్య గళం): జాతీయ రహదారిని ఆనుకుని చెత్తను డంప్ చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి హుజురాబాద్ మండలం సిర్సపల్లి సమీపంలో 563వ జాతీయ రహదారి పక్కన ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డును ఆమె పరిశీలించారు జాతీయ రహదారికి ఆనుకుని డంపింగ్ యార్డు ఉండటంపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కలెక్టర్ అక్కడి పరిస్థితులను పరిశీలించారు. రహదారికి సమీపంలో కొంత దూరం వరకు...