విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రవాణా శాఖ సూచన మహబూబాబాద్, ఆగస్టు 18(చైతన్యగళం): రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని JNTUH ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలు, సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,...